Andhra Pradesh: వికేంద్రీకరణే ఈ రాష్ట్రానికి శరణ్యం: మంత్రి కన్నబాబు వ్యాఖ్యలు

  • అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి కన్నబాబు
  • వికేంద్రీకరణే మేలని శివరామకృష్ణన్ కమిటీ ఎప్పుడో చెప్పిందన్న మంత్రి
  • చంద్రబాబుపై విమర్శలు

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడారు. వికేంద్రీకరణే ఈ రాష్ట్రానికి శరణ్యమని, రాష్ట్ర ప్రజలందరూ ఇదే కోరుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారని, ఏ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలని సీఎం జగన్ ప్రణాళికలు రచిస్తున్నారని వివరించారు. జీఎన్ రావు, బీసీజీ కమిటీల కంటే ముందే శివరామకృష్ణన్ కమిటీ వికేంద్రీకరణ జరగాలని సూచించిందని మంత్రి వెల్లడించారు.

ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కారణంగానే రాష్ట్ర ప్రజలు ఇవాళ రాజధాని లేకుండా మిగిలిపోయారని ఆరోపించారు. ప్రాంతాల మధ్య అడ్డుగోడలు కట్టడం చంద్రబాబుకు అలవాటేనని అన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాలకు, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు మధ్య అపోహలు పెంచే విధంగా వ్యవహరించవద్దని చంద్రబాబుకు హితవు పలికారు.

More Telugu News