సమాజానికి, పేదలకు సేవ చేసినప్పుడే మనిషి జీవితం సార్థకం: మంత్రి హరీశ్ రావు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సమాజానికి, పేదలకు సేవ చేసినప్పుడే మనిషి జీవితం సార్థకం: మంత్రి హరీశ్ రావు

  • నాగులబండలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ప్రారంభం
  • కార్పొరేట్ స్థాయి కంటివైద్యం ఇక్కడ లభిస్తుంది
  • ప్రతి 50 వేల మందికి ఒక సబ్ సెంటర్ ఏర్పాటు
సమాజానికి, పేదలకు సేవలు చేసినప్పుడే మనిషి జీవితం సార్థకమవుతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం నాగులబండ వద్ద ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి చైర్మన్ జీఎన్ రావు, హెటిరో డ్రగ్స్ చైర్మన్ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.

సిద్దిపేటలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని ఏర్పాటు చేయడం, సమాజానికి ఉపయోగపడాలనే సంకల్పంతో సేవా కార్యక్రమాలు చేస్తున్న హెటిరో డ్రగ్స్ సంస్థ కృషి చేయడం అభినందనీయమని హరీశ్ రావు అన్నారు. ఈ సందర్భంగా జీఎన్ రావుకు, పార్థసారథికి ఆయన అభినందనలు తెలిపారు. నాగులబండలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిని ప్రజలు వినియోగించుకోవాలని, కార్పొరేట్ స్థాయి కంటివైద్యం ఇక్కడ లభిస్తుందని చెప్పారు. ప్రతి 50 వేల మందికి ఒక సబ్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. సిద్దిపేటలో కేన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని పార్థసారథిని హరీశ్ రావు కోరారు.
Harish Rao
Minister
Siddipet District
Nagulabandla

More Telugu News