BJP: 5 ప్రత్యర్థి పార్టీల మొత్తం ఆదాయానికి రెట్టింపు అందుకున్న బీజేపీ!

  • పొలిటికల్ పార్టీలపై ఏడీఆర్ నివేదిక
  • రూ. 2400 కోట్ల ఆదాయంతో బీజేపీ ఫస్ట్
  • రూ. 910 కోట్లకు పరిమితమైన కాంగ్రెస్

కేంద్రంలో అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీ, గడచిన 2019లో రూ. 2,400 కోట్ల ఆదాయాన్ని పొందింది. దేశంలో బీజేపీకి ప్రత్యర్థులుగా ఉన్న ఐదు ప్రధాన రాజకీయ పార్టీల మొత్తం ఆదాయంతో పోలిస్తే, ఇది దాదాపు రెట్టింపు కావడం గమనార్హం. బీజేపీ ఆదాయంలో మూడింట రెండో వంతు... అంటే, దాదాపు రూ. 1450 కోట్లు (సుమారు 204 మిలియన్ డాలర్లు) ఎలక్టోరల్ బాండ్ల రూపంలోనే వచ్చాయి. వీటిని కార్పొరేట్ కంపెనీలు, వ్యక్తులు, విదేశీ సంస్థలు బీజేపీకి నిధుల రూపంలో అందించాయి. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

గడచిన మేలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 300 సీట్లకు పైగా సాధించిన బీజేపీ, కేంద్రంలో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీకి ప్రధాన విపక్షంగా ఉన్న కాంగ్రెస్ గత ఏడాది రూ. 910 కోట్ల విరాళాలను పొందింది. ఈ మొత్తంలో 41.7 శాతం ఎలక్టోరల్ బాండ్ల రూపంలో లభించిందని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. తృణమూల్ కాంగ్రెస్ కు రూ. 192 కోట్ల ఆదాయం లభించింది. సీపీఎంకు రూ. 108 కోట్లు, సీపీఐకి రూ. 71 కోట్లు, బీఎస్పీకి రూ. 69.70 కోట్ల ఆదాయం లభించింది.

More Telugu News