'సరిలేరు నీకెవ్వరు' నిన్నటి వరకూ వసూళ్ల వివరాలు!

20-01-2020 Mon 09:17
  • ఈ నెల 11న విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు'
  • తెలుగు రాష్ట్రాల్లో రూ. 98.82 కోట్ల వసూళ్లు
  • విదేశాల్లో కలెక్షన్స్ కలిపితే మరింత షేర్

ఈ సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మహేశ్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం సూపర్ హిట్ గా నిలిచి, కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 11వ తేదీన విడుదల కాగా, నిన్నటి వరకూ 9 రోజుల కలెక్షన్స్ ను ప్రకటించారు.  

ఈ సినిమా నైజాంలో రూ. 32.10 కోట్లు, సీడెడ్ లో 14.25 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 16.20 కోట్లు, గుంటూరులో రూ. 8.88 కోట్లు, తూర్పు గోదావరిలో రూ. 9.75 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ. 6.36 కోట్లు, కృష్ణాలో రూ. 7.77 కోట్లు, నెల్లూరులో రూ. 3.51 కోట్లను వసూలు చేసిందని పేర్కొంది. మొత్తంగా 9 రోజుల్లో రూ. 98.82 కోట్లు వసూలైనాయని స్పష్టం చేసింది. ఈ షేర్ కు విదేశాల్లో కలెక్షన్స్ అదనం.