తమిళనాడులో అమానుషం... నక్కతో జల్లికట్టు... సీరియస్ అయిన అధికారులు!
- వల వేసి నక్కను పట్టిన యువకులు
- మారియమ్మన్ ఆలయంలో పూజల అనంతరం జల్లికట్టు
- 11 మందిపై కేసు పెట్టిన అధికారులు
ఈ ఘటన చిన్నమనాయకన్ పాళయంలో జరిగింది. జల్లికట్టుకు ముందు డప్పు వాయిద్యాలతో గుంట నక్కను గ్రామంలో ఊరేగించి, ఆపై స్థానిక మారియమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు సీరియస్ అయి, 11 మందిపై కేసులు నమోదు చేసి, వారికి రూ. 55 వేల జరిమానా విధించారు.
కాగా, గ్రామ యువకులు సమీపంలోని అటవీ ప్రాంతంలో నక్క కోసం వల వేశారని, వలలో నక్క చిక్కుకోగా, తీసుకుని వచ్చి జల్లికట్టు నిర్వహించారని అధికారులు తెలిపారు. వారిపై అటవీ చట్టం కింద కేసు నమోదు చేశామని అన్నారు.