Andhra Pradesh: చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ విస్తృతస్థాయి సమావేశం

  • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరు
  • అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
  • రాజధాని తరలింపు అడ్డుకునేందుకు వ్యూహరచన
రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ వైఖరిపై చర్చించేందుకు టీడీపీ ప్రజాప్రతినిధులు, కీలకనేతలు సమావేశమయ్యారు. పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్యనేతలు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలే ఈ సమావేశం ప్రధాన అజెండా అని తెలుస్తోంది.

రాజధాని తరలింపు ప్రక్రియను అడ్డుకునే అవకాశాలపై ఈ భేటీలో వ్యూహరచన చేయనున్నారు. శాసనమండలిలో తమకు ఉన్న ఆధిక్యతను ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపైనా చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేసే  అవకాశాలున్నాయి. కాగా, ఎన్టీఆర్ భవన్ లో వివిధ ప్రాంతాల ప్రజలు చంద్రబాబును కలిసి అమరావతి ఉద్యమానికి విరాళాలు ఇచ్చారు. రేపటి అసెంబ్లీ ముట్టడికి తాము కూడా వస్తామని తెలిపారు.
Andhra Pradesh
Assembly
Telugudesam
Chandrababu
Amaravati

More Telugu News