KCR: సీఎం కేసీఆర్ అటువంటి ప్రయత్నాలు ఎందుకు చేయట్లేదు?: ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

  • కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సీఏఏను వ్యతిరేకించాయి
  • కేంద్రంలోని బీజేపీకి టీఆర్‌ఎస్‌ చాలాసార్లు మద్దతు ఇచ్చింది
  • ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చారు
  • ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదానికి కూడా టీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చింది 

కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సీఏఏను వ్యతిరేకించాయని, మరి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌  ఎందుకు అలాంటి ప్రయత్నాలు చేయట్లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. నల్గొండలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కేంద్రంలోని బీజేపీకి టీఆర్‌ఎస్‌ చాలాసార్లు మద్దతు ఇచ్చిందని, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చారని గుర్తు చేశారు.

ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదానికి కూడా టీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చిందని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. మునిసపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు కాంగ్రెస్‌కు ఓటేయాలని ఆయన కోరారు. తెలంగాణలో ఎస్సీలు అతిపెద్ద సామాజిక వర్గమని, అయితే, ఒక్క ఎస్సీకి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించలేదని ఆయన విమర్శించారు.
మంద కృష్ణను అనేకసార్లు కేసీఆర్‌ జైల్లో పెట్టించారని ఆయన అన్నారు.

More Telugu News