అమరావతి జేఏసీ తలపెట్టిన అసెంబ్లీ ముట్టడికి అనుమతి లేదు: ఐజీ బ్రిజ్ లాల్
- ఈ నెల 20న అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన జేఏసీ
- రాజధానిలో 144 సెక్షన్, 30 పోలీస్ చట్టం అమల్లో ఉందన్న ఐజీ
- ముట్టడికి ఎవరూ రావొద్దంటూ ప్రజలకు సూచన
అంతేకాదు, అమరావతి జేఏసీ తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి హాజరు కావొద్దంటూ ప్రజలకు సూచించారు. రాజధాని గ్రామాలకు కొత్తవారిని అనుమతించవద్దని, కొత్త వాళ్లు వస్తే చట్టవిరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాజధాని గ్రామాల్లో ఇతరులకు ఆశ్రయం ఇచ్చిన వాళ్లపైనా, వారికి వాహనాలు, వసతులు సమకూర్చినవారిపైనా చట్టబద్ధమైన చర్యలు ఉంటాయని ఐజీ బ్రిజ్ లాల్ హెచ్చరించారు.