సీఏఏపై కొత్త పెళ్లికొడుకు వినూత్న ప్రచారం!
- పౌరసత్వ సవరణ చట్టానికి వినూత్న మద్దతు
- వివాహానికి వచ్చిన వారికి అవగాహన కల్పిస్తా
- సీఏఏపై నా వంతుగా ప్రయత్నం చేస్తున్నా
సాధారణంగా పెళ్లి కార్డులపై శుభ సూచకంగా దేవుడి చిత్రాలు ముద్రిస్తారు. కానీ మధ్యప్రదేశ్ లోని నర్సింగ్ పూర్ కు చెందిన ప్రభాత్ గడ్వాల్ సీఏఏకు మద్దతు తెలపడానికి ఈ వినూత్న పంథాను ఎంచుకున్నాడు. ఈ చట్టంపై తనవంతుగా కొంతమందికైనా అవగాహన కల్పించడానికి ఈ ప్రయత్నం చేస్తున్నట్లు ప్రభాత్ మీడియాతో చెప్పాడు. పెళ్లికి వచ్చిన వారందరికీ.. సీఏఏ గురించి వివరిస్తానని చెబుతున్నాడు.