కలర్స్ స్వాతి ఇప్పుడెలా ఉందో చూడండి!

18-01-2020 Sat 19:06
  • బక్కచిక్కిన స్వాతి
  • ఫోటోలు చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
  • ఓ పైలెట్ ను పెళ్లాడి ఇండోనేషియాలో స్థిరపడిన స్వాతి

తెలుగులో అనేక హిట్ చిత్రాల్లో నటించిన కలర్స్ స్వాతి కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. స్వాతి పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలైంది. టీవీ యాంకర్ గా, రేడియో జాకీగా, సినీ నటిగా స్వాతి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. విమాన పైలెట్ వికాస్ ను పెళ్లి చేసుకున్న స్వాతి, ప్రస్తుతం ఇండోనేషియాలోని జకార్తాలో ఉంటోంది.

 అయితే రీసెంట్ గా ఆమె ఫొటోలు చూసి అభిమానులు విస్మయానికి గురవుతున్నారు. ఇంతకుముందు బబ్లీగా కనిపించిన స్వాతి ఇప్పుడు బక్కచిక్కినట్టుగా కనిపిస్తోంది. స్వాతి ఇంత సన్నగా ఉండడానికి అనారోగ్య సమస్య కారణం అయ్యుండొచ్చని నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం, 'కార్తికేయ' సీక్వెల్ లో నటించేందుకే ఇంత స్లిమ్ గా మారిందని అంటున్నారు.