Andhra Pradesh: వికేంద్రీకరణకు మద్దతుగా శివరామకృష్ణన్ వీడియోలు పోస్టు చేసిన వైసీపీ

  • గతంలో వికేంద్రీకరణకు మొగ్గు చూపిన శివరామకృష్ణన్
  • అభివృద్ధిలో ఒక ప్రాంత ఆధిపత్యం ఉండకూడదని వెల్లడి
  • నాటి వీడియోలను తెరపైకి తీసుకువచ్చిన వైసీపీ

అభివృద్ధిలో ఒక ప్రాంత ఆధిపత్యం ఉండరాదని, అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను గౌరవించాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివరామకృష్ణన్ గతంలో పేర్కొనగా, దానికి సంబంధించిన వీడియోలను వైసీపీ తాజాగా తెరపైకి తీసుకువచ్చింది. వాటిని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని శివరామకృష్ణన్ గతంలో తెలిపారు. ఒక భారీ నగరాన్ని నిర్మించాలనుకోవడం, అక్కడే అభివృద్ధిని కేంద్రీకరించాలనుకోవడం సమస్యకు పరిష్కారం కాదని శివరామకృష్ణన్ నాడు హితవు పలికారు.

ఏడాదికి మూడు పంటలు పండడం ఓ వరం అని, అలాంటి గుంటూరు-విజయవాడ మధ్య ప్రాంతంలో నిర్మాణాలు చేపడితే ఆహార  భద్రతకు ముప్పు ఉంటుందని, 21వ శతాబ్దంలో అభివృద్ధి అన్నది వికేంద్రీకరణ, నగరాల అనుసంధానం, సాంకేతిక అనుసంధానంపై ఆధారపడి ఉంటుందని కమిటీలోని ఓ సభ్యుడు వివరించారు.

More Telugu News