CPI Narayana: ప్రొ.కాశీం నివాసంలో పోలీసుల సోదాలు.. మండిపడ్డ సీపీఐ నారాయణ

  • ఓయూ క్యాంపస్‌ ఆవరణలోని క్వార్టర్స్‌లో సోదాలు
  • మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న అనుమానం
  • తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపిన సీపీఐ నేత నారాయణ 
  • ఆయనను పోలీసులు హింసిస్తున్నారని వ్యాఖ్య 
ఇటీవల విరసం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కాశీం ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఓయూ క్యాంపస్‌ ఆవరణలోని క్వార్టర్స్‌లో ఆయన ఉంటున్నారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న సమాచారంతో గజ్వేల్‌ డీసీపీ నారాయణ ఆధ్వర్యంలో పోలీసులు ఆయన ఇంట్లో సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాశీం నివాసంలో సోదాలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఐ నేత నారాయణ తెలిపారు. ఆయన ఇంటిపై దాడులు చేస్తూ ఆయనను పోలీసులు హింసిస్తున్నారని అన్నారు. ఆయనేం సాయుధ పోరాటం చేయలేదని చెప్పారు. ఆయన ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారని అన్నారు. ఆయనపై కేసులు పెట్టి ఇప్పటికే మానసిక క్షోభకు గురి చేశారని తెలిపారు.
CPI Narayana
Hyderabad

More Telugu News