Mahesh Babu: వారం రోజుల్లోనే 100 కోట్ల షేర్ ను సాధించిన మహేశ్ బాబు

  • రూట్ మార్చిన మహేశ్ బాబు 
  • ఆయన నమ్మకాన్ని నిలబెట్టిన అనిల్ రావిపూడి
  • 100 కోట్ల షేర్ సాధించిన మూడో సినిమా 
సాధారణంగా మహేశ్ బాబు ఒక కథకు ఓకే చెప్పడం .. ఒక దర్శకుడిని నమ్మి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అంత తేలికగా చేయడు. ముఖ్యంగా ఆయన సీనియర్ డైరెక్టర్లకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంటాడు. అలాంటి మహేశ్ బాబు .. అనిల్ రావిపూడి విషయంలో మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.

అనిల్ రావిపూడి సాధించిన వరుస హిట్లు .. కంటెంట్ పై ఆయన పెట్టే శ్రద్ధ .. ఆయన టేకింగ్ మహేశ్ బాబుకి నచ్చాయి. ఈ కారణంగానే ఆయన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా చేశాడు .. భారీ విజయాన్ని అందుకున్నాడు. విడుదలైన వారం రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల షేర్ ను సాధించింది. 'భరత్ అనే నేను'.. 'మహర్షి' సినిమాల తరువాత 100 కోట్ల షేర్ ను సాధించిన 3వ చిత్రంగా 'సరిలేరు నీకెవ్వరు' నిలవడం విశేషం.
Mahesh Babu
Rashmika Mandanna

More Telugu News