Nirbhaya: సోనియాను ఆదర్శంగా తీసుకోండి.. నిర్భయ తల్లికి సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ విజ్ఞప్తి!

  • దోషులను క్షమించి వదిలిపెట్టండి
  • ఆశాదేవి పెద్ద మనసు చేసుకోవాలి
  • ఉరి శిక్షలకు మేం వ్యతిరేకం

నిర్భయ దోషుల ఉరికి సర్వం సిద్ధమవుతున్న వేళ.. ప్రముఖ సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దోషులకు క్షమాభిక్ష పెట్టాలని నిర్భయ తల్లి ఆశాదేవికి ఆమె విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఈ విషయంలో ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఆమె భర్త, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో దోషి అయిన నళినిని ఆమె క్షమించారని ఈ సందర్భంగా ఇందిర గుర్తు చేశారు. ఈ విషయంలో ఆశాదేవి పెద్ద మనసు చేసుకోవాలని కోరారు.

తన కుమార్తె మరణాన్ని రాజకీయం చేస్తున్నారన్న ఆశాదేవి ఆవేదనలో అర్థం ఉందని, ఈ విషయంలో ఆమెకు తాను పూర్తి మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు. అయితే, ఉరిశిక్షలకు మాత్రం తాము పూర్తి వ్యతిరేకమని ఆమె స్పష్టం చేశారు. ఇందిర అభ్యర్థనపై ఆశాదేవి ఇప్పటి వరకు స్పందించలేదు. తన కుమార్తెకు న్యాయం కావాలంటూ ఏడేళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్న ఆశాదేవి.. జైలు అధికారులు ఉరికి ఏర్పాట్లు చేస్తున్న వేళ ఇందిర అభ్యర్థనకు ఎలా స్పందిస్తారోనన్న చర్చ ఇప్పుడు మొదలైంది.

More Telugu News