Jagan: జగన్ పిటిషన్లను తిరస్కరించిన సీబీఐ కోర్టు

షార్ట్స్‌లో చూడండి
అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ విచారణలను ఎదుర్కొంటున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు హైదరాబాదులోని సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. 5 ఛార్జిషీట్లను కలిపి ఒకేసారి విచారించాలంటూ ఆయన చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. పిటిషన్ ను కొట్టేసింది. దీంతోపాటు, సీబీఐ విచారణ ముగిసే వరకు ఈడీ విచారణను నిలిపివేయాలనే మరో పిటిషన్ ను కూడా తిరస్కరించింది. మరోవైపు, క్విడ్ ప్రోకో కేసుల్లో ఉన్న కంపెనీల ప్రతినిధులు ఈ రోజు విచారణకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో, వచ్చే వారం విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
Go Back to Shorts
Jagan
YSRCP
CBI

More Telugu News