Jagan: జగన్ అక్రమాస్తుల కేసు: నేటి విచారణకు జగన్ కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు

  • హైదరాబాద్‌, నాంపల్లిలోని సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ
  • విజయసాయిరెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన హాజరు 
  • గత శుక్రవారం కోర్టుకు హాజరైన జగన్ 
హైదరాబాద్‌లోని నాంపల్లిలోని సీబీఐ కోర్టులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసు విచారణ కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం కోర్టుకు విజయసాయిరెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు హాజరయ్యారు. గత శుక్రవారం విచారణకు హాజరైన జగన్, నేడు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరగా, న్యాయస్థానం అనుమతించింది.

ఈ కేసులో డిశ్చార్జ్ పిటిషన్లన్నీ ఒకేసారి విచారించాలని గత వారం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. జగన్ తరఫున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించగా.. సీబీఐ తరఫున సురేందర్ రెడ్డి వాదనలు వినిపించిన విషయం తెలిసిందే.

More Telugu News

Jagan
Hyderabad
cbi