Andhra Pradesh: అమరావతిపై సీఎం జగన్ కసి పెంచుకుంటున్నారు: సీపీఐ రామకృష్ణ

షార్ట్స్‌లో చూడండి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించి రైతుల దీక్షకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమరావతిపై సీఎం జగన్ కసి పెంచుకుంటున్నారని విమర్శించారు. రాజధాని మార్పుపై జగన్, విజయసాయి రెడ్డి మాత్రమే చర్చించుకుని రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజల తలరాత రాస్తున్నారని మండిపడ్డారు.

ఈ విషయంలో కనీసం ఉప ముఖ్యమంత్రులను కానీ, మంత్రులను కానీ సంప్రదించకుండానే నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. రాజధాని అమరావతి జోలికి రావొద్దని, వస్తే ఇక్కడి నుంచి మీ రాజకీయ పతనం ప్రారంభమవుతుందని సీఎం జగన్ ను ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా, ఈ నెల 20న ఏపీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. రైతులందరూ తరలిరావాలని కోరారు.
Go Back to Shorts
Andhra Pradesh
Amaravati
CPI
Ramakrishna
YSRCP
Jagan

More Telugu News