Andhra Pradesh: ఏపీలోని ఆరు జిల్లాల్లో వాటర్ గ్రిడ్ కోసం భారీగా నిధులు మంజూరు

  • ఇంటింటికీ మంచినీటి పథకం
  • రాష్ట్ర తాగునీటి సంస్థకు రూ.12,308 కోట్లు
  • వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులకు పాలనా అనుమతులు

ఇంటింటికీ మంచినీరు సరఫరా ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తిచేసేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ క్రమంలో ఆరు జిల్లాల్లో వాటర్ గ్రిడ్ పనుల కోసం భారీగా నిధులు మంజూరు చేశారు. రాష్ట్ర తాగునీటి సరఫరా సంస్థకు రూ.12,308 కోట్లు మంజూరు చేశారు.

వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాకు రూ.3960 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాకు రూ.3670 కోట్లు, శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం ప్రాంతానికి రూ.700 కోట్లు, గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి రూ.2655 కోట్లు, ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతానికి రూ.833 కోట్లు, పులివెందుల ప్రాంతానికి రూ.480 కోట్లు మంజూరు చేశారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల నిర్మాణానికి పాలనా పరమైన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా గ్రామాల్లో ఓ కుటుంబానికి 100 లీటర్లు, పట్టణాల్లో 135 లీటర్లు నీరు ఇవ్వాలని నిర్ణయించారు.

More Telugu News