Posani: కుటుంబాన్ని మాత్రం పక్కన పెట్టను: పోసాని

  • నటుడిగా టెన్షన్ లేకుండా వున్నాను 
  • డబ్బు కోసం డే అండ్ నైట్లు చేయను 
  • వృత్తి .. కుటుంబం రెండూ ముఖ్యమేనన్న పోసాని

పోసాని కృష్ణమురళి నటుడిగా విభిన్నమైన మేనరిజంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, బిజీ బిజీగా తన కెరియర్ ను కొనసాగిస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "ఒకప్పుడు నేను అద్దె ఇంట్లో వున్నాను .. ఆ తరువాత ఫ్లాట్ కొనుక్కున్నాను. రచయితగా కంటే నటుడిగానే టెన్షన్ లేకుండా వున్నాను. ఇప్పుడు నా జీవితం సంతోషంగా .. సంతృప్తికరంగా సాగుతోంది.

ఒక జాబ్ మాదిరిగానే ఉదయాన్నే షూటింగుకి వెళ్లి సాయంత్రానికి వచ్చేస్తాను. ఎంత పారితోషికం ఇస్తానని చెప్పినా గానీ డే అండ్ నైట్లు చేయను. నా భార్య పిల్లలతో కొంత సమయాన్ని గడపడానికి ఇష్టపడతాను. సగం జీవితం సినిమా ..  సగం జీవితం కుటుంబం అన్నట్టుగా నేను వుంటాను. ఈ రెండింటిలో దేనినీ దూరం చేసుకోను. ఈ రెండింటిలో ఏదో ఒక దానిని దూరం చేసుకోవలసి వస్తే, సినిమాలను పక్కనపెడతానేగానీ, కుటుంబాన్ని మాత్రం పక్కన పెట్టను" అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News