Posani: ఒక్క వారంలోనే 35 సినిమాలు ఒప్పుకున్నాను: పోసాని

  • పరుచూరి దగ్గర అసిస్టెంట్ గా చేశాను
  • 'మెంటల్ కృష్ణ'తో నటుడినయ్యాను
  • ఇంతవరకూ ఖాళీగా లేనన్న పోసాని

రచయితగా .. నటుడిగా .. దర్శకుడిగా పోసాని కృష్ణమురళికి మంచి క్రేజ్ వుంది. ప్రస్తుతం ఆయన నటుడిగా బిజీగా వున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "మాది గుంటూరు సమీపంలోని 'పెద కాకాని'. పై చదువుల కోసం నేను చెన్నైకి వెళ్లాను. ఒక వైపున చదువుకుంటూనే మరో వైపున పరుచూరి బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్ గా చేసేవాడిని.

రచయితగా 100 సినిమాల వరకూ పనిచేసిన తరువాత దర్శకుడినయ్యాను. దర్శకుడిగా కొనసాగుతున్న సమయంలోనే 'మెంటల్ కృష్ణ' సినిమాతో నటుడినయ్యాను. ఆ సినిమాతో నటుడిగా మంచి పేరు వచ్చింది. ఆ తరువాత 'నాయక్' సినిమాలో చేసిన పాత్ర బాగా పేలింది. ఆ తరువాత వరుసబెట్టి ఆఫర్లు వచ్చాయి. అలా ఒక్క వారంలోనే 35 సినిమాలకి సైన్ చేశాను. ఈ 30 యేళ్లలో నేను ఇంతవరకూ ఖాళీగా లేకపోవడమే విశేషం" అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News