రాజధానిపై అసెంబ్లీలో చేయబోయే తీర్మానానికి విలువ లేదు: సీపీఐ నారాయణ
- అమరావతి ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళతాం
- రాజధానిపై మోదీకి డి.రాజా లేఖ రాస్తారు
- అమరావతి అంశంపై రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలి
రాజధానిని విశాఖపట్నానికి తరలిస్తే అమరావతి కంటే ఎక్కువ వ్యయమవుతుందని నారాయణ తెలిపారు. ఉద్యోగులకు రాయితీలు, ఇతర ఖర్చులతో సుమారు నాలుగు లక్షల కోట్ల రూపాయలు అవుతుందని చెప్పారు. అదే డబ్బుతో అమరావతిలోనే గొప్ప రాజధాని నిర్మాణం చేపట్టవచ్చని ఆయన అన్నారు.