Indian currency: భారత కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి బొమ్మ ముద్రిస్తే మేలు!: సుబ్రహ్మణ్యస్వామి

  • ఇండోనేషియా కరెన్సీపై విఘ్నేశ్వరుడి బొమ్మ
  • అప్పుడే కరెన్సీ పరిస్థితి మెరుగవుతుంది
  • దీనిని ఎవరూ చెడుగా భావించక్కర్లేదు 
ఇండోనేషియా కరెన్సీలా మన దేశ కరెన్సీపైనా దేవుళ్ల బొమ్మలు ముద్రిస్తే మేలు జరుగుతుందని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇండోనేషియా కరెన్సీపై గణేశుని బొమ్మ ముద్రించడాన్ని విలేకరులు ఆయన వద్ద ప్రస్తావించినప్పుడు.. స్వామి ఇలా స్పందించారు.

మన కరెన్సీపైనా లక్ష్మీదేవి బొమ్మను ముద్రించాలన్నారు. నోట్లపై దేవుళ్ల బొమ్మలు ముద్రించడానికి తాను పూర్తిగా అనుకూలంగా ఉన్నట్టు చెప్పారు. అంతేకాదు, భారత కరెన్సీపై లక్ష్మీదేవి బొమ్మను ముద్రిస్తే.. మన కరెన్సీ పరిస్థితి మెరుగవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎవరూ చెడుగా భావించాల్సిన అవసరం లేదని సుబ్రహ్మణ్యస్వామి స్పష్టం చేశారు.
Indian currency
Goddes Laxmidevi
Subrahmaniyan swamy

More Telugu News