Venkatadri express rail: వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు తప్పిన పెను ముప్పు.. ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు

  • చిత్తూరు నుంచి కాచిగూడ వెళ్తున్న రైలు
  • ఓబులవారిపల్లె వద్ద విరిగిన రైలు పట్టా
  • మరమ్మతుల అనంతరం బయలుదేరిన రైలు
చిత్తూరు నుంచి కాచిగూడ వెళ్తున్న వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రైలు కడప జిల్లాలోని ఓబులవారిపల్లె వద్దకు రాగానే పట్టా విరిగినట్టు గుర్తించి నిలిపివేశారు. అనంతరం రైల్వే సిబ్బందికి సమాచారం అందించడంతో వారొచ్చి మరమ్మతులు చేపట్టారు. ఆ తర్వాత రైలు బయలుదేరింది.

విరిగిన పట్టాను గుర్తించకుంటే పండుగ వేళ పెను ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. మరమ్మతుల కారణంగా రైలు దాదాపు గంటపాటు నిలిచిపోయింది. ప్రమాదం నుంచి బయటపడిన విషయం తెలిసిన ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 
Venkatadri express rail
Chittoor District
Kachiguda

More Telugu News