India: నష్టాల్లో ముగిసిన సూచీలు.... మరోసారి భారత మార్కెట్లపై ప్రభావం చూపిన అమెరికా, చైనా వాణిజ్యం

  • చైనా వస్తువులపై సుంకాలు వెనక్కి తీసుకోని అమెరికా
  • లాభాల స్వీకరణకు ఉపక్రమించిన మదుపర్లు
  • దేశీయ మార్కెట్లకు తప్పని నష్టాలు

చైనా ఉత్పత్తి చేసే అనేక వస్తువులపై అమెరికా సుంకాలు వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయకపోవడం భారత మార్కెట్లపైనా ప్రభావం చూపింది. ప్రతిపాదిత అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంలో చైనా వస్తువులపై సుంకాల ఉపసంహరణ అంశాలు లేకపోవడం అంతర్జాతీయ మార్కెట్లను ప్రభావితం చేసింది.

ఈ నేపథ్యంలో మదుపర్లు లాభాలు స్వీకరించేందుకు మొగ్గు చూపడంతో దేశీయ మార్కెట్లు మందగమనం ప్రదర్శించాయి. హీరో మోటార్స్, మారుతి సుజుకి, యస్ బ్యాంకు షేర్లు లాభాల బాటలో పయనించగా, భారత్ పెట్రోలియం, ఇన్ఫోసిస్, ఇండస్ ఇండ్, ఎస్ బీఐ షేర్లు నష్టాలు చవిచూశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 79.90 పాయింట్ల నష్టంతో 41,872 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికొస్తే 19 పాయింట్ల నష్టంతో 12,343 పాయింట్ల వద్ద స్థిరపడింది.

More Telugu News