కాంగ్రెస్ దారిలోనే బీజేపీ నడుస్తోంది.. అందుకే ఇలా జరుగుతోంది: మాయావతి

  • రాజకీయ ప్రయోజనాల కోసం అధికారాన్ని దుర్వినియోగం చేస్తోంది
  • దేశ వ్యాప్తంగా శాంతి, భద్రతల సమస్య నెలకొంది
  • ఇది దేశ పరిస్థితులను ఆందోళనలో నెట్టేసే విషయం
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఆమె మీడియాతో మాట్లాడుతూ... 'బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా గత కాంగ్రెస్ పార్టీ నడిచిన దారిలోనే నడుస్తోంది. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం అధికారాన్ని దుర్వినియోగం చేస్తోంది' అని అన్నారు.

'కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల దేశ వ్యాప్తంగా శాంతి, భద్రతల సమస్య నెలకొంది. ఇది దేశ పరిస్థితులను ఆందోళనలోకి నెట్టేసే విషయం' అని మాయావతి విమర్శలు గుప్పించారు. పౌరసత్వ సవరణ చట్టం వంటి విషయాలపై దేశ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుగుతోన్న నేపథ్యంలో ఈ విధంగా విమర్శలు గుప్పించారు.
Go Back to Shorts
bsp
BJP
mayawati

More Telugu News