Andhra Pradesh: రాజధానిపై ప్రభుత్వానిది అనాలోచిత చర్య: జేఏసీ నేత శివారెడ్డి

  • పోలీసు దాడులు సరికాదని హితవు
  • హైకోర్టు నిర్ణయాన్ని గౌరవించాలని స్పష్టీకరణ
  • రేపు రాష్ట్రవ్యాప్తంగా ముగ్గులు వేసి నిరసన తెలుపుతామని వెల్లడి

ఏపీ రాజధాని మార్పును నిరసిస్తూ అమరావతి జేఏసీ ఏర్పడిన సంగతి తెలిసిందే. తాజాగా జేఏసీ నేత శివారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాజధానిపై ప్రభుత్వానిది అనాలోచిత నిర్ణయం అని విమర్శించారు. రైతులు, మహిళలు గాంధేయమార్గంలో ఉద్యమం చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం, దాడులు చేయడం సరికాదని హితవు పలికారు. హైకోర్టు నిర్ణయాన్ని పోలీసులు గౌరవించాలని స్పష్టం చేశారు. రేపు మహిళా జేఏసీ ఆధ్వర్యంలో ముగ్గులు వేసి మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలియజేస్తామని శివారెడ్డి వెల్లడించారు.

More Telugu News