Bhimavaram: భీమవరంలో కోడి పందాలను దగ్గరుండి ప్రారంభించిన వైసీపీ ఎంపీ!

  • భీమవరంలో రఘురామకృష్ణంరాజు
  • ఇంటి వద్ద డింకీ పందాలు వేసిన ఎంపీ
  • కత్తులు కట్టేందుకు మాత్రం వ్యతిరేకమని వెల్లడి

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు,  దగ్గరుండి కోడి పందాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు ప్రజల సంక్రాంతి సంప్రదాయంలో కోడి పందాలు ఓ భాగమని, అయితే, పందాలు, కత్తులకు మాత్రం తాను వ్యతిరేకమని ఆయన అన్నారు. తన ఇంటి వద్ద డింకీ పందాలు నిర్వహించానని తెలిపారు. ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఆయన, ఈ సంక్రాంతి సర్వ సుఖాలను, సంతోషాలను ప్రజలకు దగ్గర చేయాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

కాగా, భీమవరం, నరసాపురం, ఉండి, అమలాపురం, కాకినాడ, గుడివాడ, ఏలూరు, కైకలూరు, పెద్దాపురం తదితర ప్రాంతాల్లో భారీ ఎత్తున బరులు సిద్ధం చేసిన పందెం రాయుళ్లు, ఈ ఉదయం నుంచి పందాలను సిద్ధం చేశారు. పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ, ఏ మాత్రం జంకకుండా కత్తులు కట్టి, లక్షల్లో పందాలు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ ప్రాంతాల్లో ప్రజలు కూడా సందడిగా పందాలు కాస్తున్నారు. కోడి పందాలతో పాటు గుండాట, పేకాట కూడా జోరుగానే సాగుతున్నాయి. మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నట్టు సమాచారం.

More Telugu News