Raviteja: 'డిస్కోరాజా' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఖరారు

  • ఈ నెల 19వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • 24వ తేదీన సినిమా విడుదల
  • రవితేజ సరసన ముగ్గురు భామలు

రవితేజ కథానాయకుడిగా 'డిస్కోరాజా' సినిమా రూపొందింది. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి ప్లాన్ చేశారు. ఈ నెల 19వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు.

హైదరాబాద్ లోని 'ఎన్ కన్వెన్షన్ సెంటర్' ఈ వేడుకకి వేదికగా మారనుంది. ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. ఆయన సరసన నాయికలుగా నభా నటేశ్ .. పాయల్ రాజ్ పుత్ .. తాన్యా హోప్ కనిపించనున్నారు. తమిళనాట స్టార్ ఇమేజ్ వున్న బాబీసింహా ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించాడు. రవితేజ కెరియర్లో ఈ సినిమా ప్రత్యేక స్థానంలో నిలవడం ఖాయమనే నమ్మకంతో అభిమానులు వున్నారు.

More Telugu News