Vikarabad District: భార్య కొడుతోందని పోలీసులను ఆశ్రయించిన భర్త

  • వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం జీవన్గీలో ఘటన
  • భార్య చేతిలో తన్నులు తినకలేక పోలీసులకు ఫిర్యాదు
  • ఆమెతో మాట్లాడతామని నచ్చజెప్పిన ఎస్సై
భర్త కొడుతున్నాడంటూ పోలీసులను భార్య ఆశ్రయించడం గురించి చాలా సార్లు విన్నాం. అయితే, భార్య కొడుతోందని ఓ అమాయక భర్త పోలీసులను ఆశ్రయించాడు. భార్య చేతిలో ఇక తన్నులు తినలేనంటూ, తనను రక్షించాలంటూ పోలీసులను వేడుకున్నాడు. ఆయన చేసిన ఫిర్యాదు పట్ల పోలీసులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం జీవన్గీలో ఈ ఘటన చోటు చేసుకుంది. షాదుల్లా అనే వ్యక్తి బషీరాబాద్‌ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఎస్సైకి తన బాధ చెప్పుకున్నాడు. ఇంట్లో భార్య చేతిలో ఆయన అనుభవిస్తోన్న కష్టాలను తెలుసుకున్న ఎస్సై.. ఆమెతో మాట్లాడి కాపురాన్ని చక్కదిద్దుతామని షాదుల్లాకు నచ్చజెప్పారు.
Vikarabad District
Police

More Telugu News