Pavan: పవన్ కల్యాణ్ జోడీగా పూజ హెగ్డే?

షార్ట్స్‌లో చూడండి
పవన్ కల్యాణ్ రాజకీయాలతో బిజీగా వున్నారు. అయితే ఆయన సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. పలువురు దర్శక నిర్మాతలు కూడా ఆయనను ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. చివరికి 'దిల్' రాజు రంగంలోకి దిగి త్రివిక్రమ్ ద్వారా పవన్ కల్యాణ్ ను ఒప్పించాడు. అలా తెలుగులో 'పింక్' రీమేక్ చేయడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

అప్పటి నుంచి ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం ఎవరిని తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో కథానాయిక పాత్ర చిన్నదే అయినా, కైరా అద్వాని పేరు వినిపించింది. అయితే ఆమె డేట్స్ కాస్త అటు ఇటుగా ఉండటం, పారితోషికం భారీగానే డిమాండ్ చేయడం జరిగిందట. అందువలన పూజ హెగ్డేను సంప్రదిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం పూజ హెగ్డే వరుస హిట్లతో మంచి క్రేజ్ లో .. మంచి ఫామ్ లో వుంది. అందువలన ఆమె ఎంపిక దాదాపు ఖరారు అవుతుందని అంటున్నారు.
Go Back to Shorts
Pavan
Pooja Hegde

More Telugu News