Nirbhaya convicts: ఉరికి అధికారుల ఏర్పాట్లు.. ఆగిపోతుందన్న ఆశలో నిర్భయ దోషులు

  • మరో 9 రోజుల్లో నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు
  • చివరిసారి కుటుంబ సభ్యులను అనుమతించాలని నిర్ణయం
  •  జైలులో మామూలుగానే ప్రవర్తిస్తున్న దోషులు
మరో 9 రోజుల్లో నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు కానుంది. ప్రస్తుతం వారిని తీహార్ జైలులో హైసెక్యూరిటీ భద్రత నడుమ ఉంచారు. దోషులు పవన్ గుప్తా, అక్షయ్, వినయ్  శర్మ, ముకేశ్ సింగ్‌లను 24 గంటలూ ముగ్గురు గార్డులు పర్యవేక్షిస్తున్నారు. 22న వీరిని ఉరి తీయనున్న నేపథ్యంలో చివరిసారి వారిని కలుసుకునేందుకు కుటుంబ సభ్యులను అనుమతించనున్నారు.

ప్రస్తుతం వారంతా మామూలుగానే ప్రవర్తిస్తున్నారని, ఉరిశిక్ష ఆగే అవకాశం ఉందన్న ఆశతో ఉన్నారని జైలు అధికారి ఒకరు తెలిపారు. ఇక ఉరి అమలుకు ముందు మీరట్ సెంట్రల్ జైలు తలారీ పవన్ కుమార్‌ తీహార్ జైలును సందర్శించి ఉరికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించనున్నారు. కాగా, ఈ నెల 16న ఇసుక బస్తాలతో జైలు అధికారులు డమ్మీ ఉరి తీయనున్నట్టు జైలు అధికారులు తెలిపారు.
Nirbhaya convicts
Tihar jail

More Telugu News