పవన్ కల్యాణ్ తన కవాతు చంద్రబాబు ఇంటి ముందు చేయాలి: అవంతి

12-01-2020 Sun 14:58
  • ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారంటూ ఆగ్రహం
  • చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నాడంటూ మండిపాటు
  • రాజధాని తొలగిస్తామని జగన్ ఎప్పుడూ చెప్పలేదని వెల్లడి

ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేలా కొన్ని పార్టీలు మాట్లాడుతున్నాయని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్  మండిపడ్డారు. చంద్రబాబునాయుడు రాజధాని ప్రజలను కావాలనే రెచ్చగొడుతున్నాడని, చంద్రబాబు ముఠా అరాచకాలకు అంతే లేదని విమర్శించారు. కవాతులు నిర్వహించాలని భావిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మొదటగా చంద్రబాబు ఇంటి ముందు కవాతు నిర్వహిస్తే బాగుంటుందని అన్నారు. అమరావతి పేరుతో ఇతర జిల్లాలను విస్మరించింది చంద్రబాబేనని అన్నారు.  అమరావతిని రాజధానిగా తొలగిస్తామని సీఎం జగన్ ఎప్పుడూ చెప్పలేదని, రాజధాని తరలింపు రహస్యంగా జరిగే ప్రక్రియ కాదని స్పష్టం చేశారు. రాజధాని రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.