పవన్‌పై ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి బూతు పురాణం... కాకినాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు
- భానుగుడి సెంటర్‌లో జనసేన కార్యకర్తల ఆందోళన
- ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఇంటి వద్ద నిరసన
- జనసేన కార్యకర్తలపై రాళ్లు రువ్విన వైసీపీ కార్యకర్తలు
- కాపాడిన పోలీసులు
ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఇంటి వద్ద జనసేన కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పలువురు జనసేన కార్యకర్తలకు గాయాలయ్యాయి. వైసీపీ కార్యకర్తల దాడి నుంచి జనసేన మహిళా కార్యకర్తలను కాపాడిన పోలీసులు వారిని దగ్గరలోని గుడిలోకి పంపారు. కొందరు జనసేన నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. పవన్ కు తక్షణమే చంద్రశేఖర్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.