Midday Meals: ఏపీలో మారిన మధ్యాహ్న భోజనం... మెనూ ఇదే!

  • రోజుకో రకమైన భోజనం
  • ప్రతిరోజూ గుడ్డు ఉండేలా మెనూ
  • ఏజన్సీలకు ఇస్తున్న మొత్తం కూడా పెంపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం మెనూను మార్చింది. విద్యార్థులకు రోజుకో రకమైన భోజనాన్ని అందిస్తామని, అందుకు అనుగుణంగా వంటకాల మార్పు ఉంటుందని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. 13 జిల్లాల్లో ఉన్న 2,889 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 3,84,829 మంది విద్యార్థులు చదువుతుండగా, వీరందరికీ ఈ పథకం కింద పోషకాహారాన్ని అందిస్తామని ఆయన తెలిపారు. ఇక మెనూ విషయానికి వస్తే...

సోమవారం: అన్నం, పప్పు, సాంబారు, గుడ్డు అన్నం, పప్పు చారు, కర్రీ, చిక్కీ
మంగళవారం: అన్నం, కూరగాయాల రసం, గుడ్డు పులిహోర, టమెటా పప్పు
బుధవారం: అన్నం, పప్పు సాంబారు, గుడ్డు కూరగాయాల అన్నం, బంగాళదుంప కూర్మా, చిక్కి
గురువారం: అన్నం, కూరగాయల రసం, గుడ్డు పెసరపప్పు కిచిడీ, టమోటా చెట్నీ
శుక్రవారం: అన్నం, పప్పు సాంబారు, గుడ్డు అన్నం, ఆకుకూర పప్పు, చిక్కి
శనివారం: అన్నం, కూరగాయల రసం, అన్నం, సాంబారు, తీపి పొంగలి, చిక్కి

ఇక మెనూ కోసం ఇస్తున్న మొత్తాన్ని కూడా పెంచుతున్నామని, నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వంట ఏజన్సీలకు ఇచ్చే మొత్తాన్ని పెంచుతామని జగన్ వ్యాఖ్యానించారు. సంక్రాంతి సెలవుల అనంతరం కొత్త మెనూ అమలు అవుతుందని అధికారులు తెలిపారు.

More Telugu News