సంక్రాంతి ఎఫెక్ట్... తిరుమలలో పెద్దగా కనిపించని భక్తులు!

12-01-2020 Sun 06:26
  • గణనీయంగా తగ్గిన భక్తుల రద్దీ
  • 4 కంపార్టుమెంట్లలో భక్తులు
  • నిన్న రూ. 2.90 కోట్ల హుండీ ఆదాయం

సంక్రాంతి పండగ ప్రభావం తిరుమల గిరులపైనా పడింది. ప్రజలంతా ఇళ్ల వద్ద పండగ హడావుడిలో ఉండటంతో కొండపై రద్దీ గణనీయంగా తగ్గింది. ఈ ఉదయం స్వామి సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివుండగా, దర్శనానికి నాలుగు గంటల సమయం వరకూ పడుతుందని అధికారులు వెల్లడించారు. దివ్యదర్శనం, రూ. 300 ప్రత్యేక దర్శనం, టైమ్ స్లాట్ టోకెన్ భక్తుల దర్శనాలకు 2 గంటల సమయం పడుతుందన్నారు. నిన్న స్వామివారిని 79,435 మంది భక్తులు దర్శించుకున్నారని, రూ. 2.90 కోట్ల హుండీ ఆదాయం సమకూరిందని వెల్లడించారు.