టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలతో కేటీఆర్ కీలక భేటీ

11-01-2020 Sat 12:12
  • తెలంగాణ భవన్‌కు వస్తున్న ఎమ్మెల్యేలు
  • మునిసిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ
  • రెబల్స్‌ విషయాన్ని కేటీఆర్‌ దృష్టికి తీసుకొస్తోన్న నేతలు

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. మునిసిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పీర్జాదిగూడకు చెందిన తమ పార్టీ నేత దర్గ దయాకర్‌రెడ్డి తీరుపై ఆయన పార్టీ నేతలతో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

దర్గ దయాకర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలతో డబుల్‌ గేమ్‌ ఆడుతూ, గంటల వ్యవధిలోనే రెండు పార్టీల నుంచీ ఆయన నామినేషన్‌ వేశారు. ఈ విషయంపై మంత్రి మల్లారెడ్డితో కేటీఆర్‌ మాట్లాడనున్నారు. రెబల్స్ లిస్టుతో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్‌కు వస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలతో ఆయన విడివిడిగా భేటీ అవుతున్నారు.