Kerala: కేరళలో క్షణాల్లో బహుళ అంతస్తుల భవనాల కూల్చివేత.. వీడియో ఇదిగో

  • సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చర్యలు
  • కొచ్చి మారడు ప్రాంతంలో ఈ రోజు రెండు భారీ నిర్మాణాల కూల్చివేత 
  • 800 కిలోల పేలుడు పదార్థాల వినియోగం
  • రెండు భవనాల్లో దాదాపు 350కి పైగా ఫ్లాట్లు 

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేరళలో అక్రమ నిర్మాణాలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొచ్చి మారడు ప్రాంతంలో రెండు భారీ నిర్మాణాలను ఈ రోజు ఉదయం అధికారుల ఆధ్వర్యంలో సిబ్బంది కూల్చేశారు. దాదాపు 800 కిలోల పేలుడు పదార్థాలతో బహుళ అంతస్తుల భవనాలను క్షణాల్లో నేటమట్టం చేశారు. ఈ రెండు భవనాల్లో దాదాపు 350కి పైగా ఫ్లాట్లు ఉన్నాయి.

ఇక్కడి మరో రెండు భవనాలను అధికారులు రేపు నేల మట్టం చేయనున్నారు. హెచ్2O హోలీ ఫైత్ అపార్ట్‌మెంటును క్షణాల వ్యవధిలో కూల్చిన వీడియోను స్థానికులు తమ స్మార్ట్‌ఫోనుల్లో వీడియో తీశారు. భవనాల కూల్చివేత నేపథ్యంలో రెండు రోజుల ముందు నుంచే అధికారులు ఆ ప్రాంతంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

More Telugu News