మిడిల్ క్లాస్ అబ్బాయిగా కనిపిస్తాను: హీరో అల్లు అర్జున్

11-01-2020 Sat 10:35
  • నా బాస్ గా పూజా హెగ్డే కనిపిస్తుంది 
  • నా తండ్రి పాత్రలో మురళీశర్మ చేశారు 
  • మా కాంబినేషన్ సీన్స్ హైలైట్  అని చెప్పిన బన్నీ

అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల వైకుంఠపురములో' చిత్రం రూపొందింది. పూజ హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాలో, 'టబు' కీలకమైన పాత్రను పోషించింది. భారీ తారాగణంతో నిర్మితమైన ఈ సినిమా, సంక్రాంతి కానుకగా ఈ నెల 12న విడుదలవుతోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ .. " త్రివిక్రమ్ కి .. నాకు మధ్య మంచి రిథమ్ కుదిరింది. అందుకే ఆయనతో మూడో సినిమా చేశాను. ఈ సినిమాలో నా పాత్రను ఆయన చాలా గొప్పగా మలిచాడు. మిడిల్ క్లాస్ అబ్బాయిగా ఈ సినిమాలో నేను కనిపిస్తాను. ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో నేను ఉద్యోగిగా ఉంటే, నా పైఅధికారిగా పూజా హెగ్డే కనిపిస్తుంది. మా ఇద్దరి మధ్య సీన్స్ ఫుల్ ఎంటర్ టైన్ చేస్తాయి. ఇక నా తండ్రి పాత్రలో మురళీ శర్మ నటించారు. ఏ మాత్రం పడని తండ్రీ కొడుకులుగా మేము తెరపై కనిపిస్తాము. మా కాంబినేషన్ సీన్స్ బాగా పేల్తాయి " అని చెప్పుకొచ్చాడు.