ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-బస్సు ఢీ.. 20 మంది సజీవ దహనం
- పేలిన డీజిల్ ట్యాంకు.. చెలరేగిన మంటలు
- మంటల్లో చిక్కుకుని విలవిల్లాడిన ప్రయాణికులు
- మరో 21 మందికి తీవ్ర గాయాలు
స్థానికులు, పోలీసులు వెంటనే రంగంలోకి దిగి 21 మంది ప్రయాణికులను కాపాడారు. అయితే, అప్పటికే మంటల్లో చిక్కుకున్న మరో 20 మందికిపైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డీజిల్ ట్యాంకు పగలడం వల్లే మంటలు చెలరేగాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద విషయం తెలిసి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.