రేపు రాజధాని అమరావతి గ్రామాల రైతుల బైక్ ర్యాలీ

10-01-2020 Fri 22:00
  • రేపు ఉదయం 9 గంటలకు ప్రారంభం
  • ర్యాలీలో 29 గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ రైతులు
  • మందడం- గుణదల వరకు ర్యాలీ

ఏపీ రాజధాని అమరావతిని తరలించాలన్న యోచనలో ఉన్న ప్రభుత్వంపై రైతుల నిరసనలు, ఆందోళనా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు క్యాండిల్ ర్యాలీలు, పాదయాత్రలు, ధర్నాలు, రోడ్డుపై బైఠాయింపులతో తమ నిరసన తెలిపిన రైతులు రేపు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు 29 గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ రైతులు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. మందడం నుంచి విజయవాడలోని గుణదల వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది.