రాజధాని బాధ్యతను కేంద్రం తీసుకోవాలి: పవన్ కల్యాణ్

10-01-2020 Fri 16:24
  • రాజధాని మార్పుపై అమరావతిలో నిరసనలు
  • కొనసాగుతున్న రైతుల దీక్షలు
  • కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని కోరిన పవన్ కల్యాణ్

ఏపీ రాజధాని మార్పు వద్దంటూ అమరావతి రైతుల దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ అంశంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ఏపీ విభజన చట్టం ప్రకారం రాజధాని బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి ఏపీ రాజధాని వ్యవహారాన్ని చక్కదిద్దాలని పవన్ అభిలషించారు. దీనిపై అఖిలపక్షం వేసి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. జనసేన కార్యాలయానికి వచ్చిన గుంటూరు జిల్లా నేతలతో పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజధాని రైతులకు అన్యాయం జరగకూడదని అన్నారు. రాజధానిపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ అభిప్రాయం వెల్లడించాలని కోరారు.