వేగంగా వెళుతున్న కారులోంచి జారిపడినా.. స్వల్పగాయాలతో బయటపడ్డ చిన్నారి
- వీడియో పోస్ట్ చేసిన ఐపీఎస్ అధికారి
- సీట్ బెల్ట్, డోర్ లాక్, నిర్ణీత వేగం.. ఆవశ్యకతపై సందేశం
- భద్రతా నిబంధనలు పాటించండంటూ సందేశం
ఘటన తాలూకు విషయం ఏమిటంటే.. వేగంగా వెళుతున్న కారు వెనక డోర్ అనుకోకుండా తెరుచుకోవడంతో.. ఓ చిన్నారి జారి రోడ్డుపైన పడిపోయింది. ముందు మలుపు ఉండటంతో వెనక నుంచి వచ్చే వాహనం వేగం తగ్గించడంతో ప్రమాదం తప్పింది. దీంతో ఆ చిన్నారి స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ వీడియోను మీరూ చూసేయండి.. జాగ్రత్తలు పాటించండి అంటూ పంకజ్ ట్వీట్ చేశారు.