చంద్రబాబు తానా అంటే పవన్ కల్యాణ్ తందానా అంటున్నారు: మంత్రి అవంతి విమర్శలు

10-01-2020 Fri 13:22
  • విశాఖలో భారీ ర్యాలీ
  • పాల్గొన్న మంత్రి అవంతి
  • చంద్రబాబు, పవన్ లపై వ్యాఖ్యలు

ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ విపక్షనేతలపై ధ్వజమెత్తారు. చంద్రబాబు రాజధాని అంశంలో అలజడులు సృష్టించి, ప్రభుత్వాన్ని అప్రదిష్ఠ పాల్జేయాలని చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు దుర్బుద్ధితో వ్యవహరిస్తూ రాజధానిని విశాఖకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తానా అంటే పవన్ తందానా అంటున్నారని అవంతి విమర్శించారు.

పవన్ ఉత్తరాంధ్రలో కాకుండా అమరావతిలో పోటీచేయాల్సిందని అన్నారు. గాజువాక నుంచి పోటీచేసిన పవన్ కల్యాణ్, ఇప్పుడు విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధాని చేస్తామంటే స్వాగతించాల్సింది పోయి వ్యతిరేకిస్తున్నాడని పేర్కొన్నారు. విశాఖపట్నం నగరాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధాని చేయాలంటూ నిర్వహించిన భారీ ర్యాలీలో అవంతి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు.