చిరూ .. కొరటాల మూవీలో అనసూయ లేదట!

10-01-2020 Fri 12:08
  • గ్లామర్ పరంగా అనసూయకి మంచి క్రేజ్
  • చిరూ మూవీలో ఛాన్స్ అంటూ ప్రచారం
  • ఇప్పుడు ఈ ప్రాజెక్టులో లేదంటూ టాక్  

చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. వినోదానికి సామాజిక సందేశాన్ని మేళవించి ఆయన ఈ సినిమాను చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను అనసూయ పోషించనున్నట్టు వార్తలు వచ్చాయి.

ముఖ్యమైన ఆ పాత్రకి అనసూయ అయితేనే బాగుంటుందని కొరటాల భావించడం .. ఆమెను సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టులో ఆమె లేదనేది తాజా సమాచారం. 'రంగస్థలం' సినిమా నుంచి అనసూయ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. చిరూ మూవీలో ఆమె ఎంపిక జరిగిపోయిన తరువాత, మళ్లీ ఇలా ఎందుకు జరిగిందనే విషయంపై ఫిల్మ్ నగర్లో రకరకాలుగా చెప్పుకుంటున్నారు. అనసూయ ఈ ప్రాజెక్టు నుంచి తప్పకుందా? తప్పించారా? అనేదే ఆ గుసగుసల సారాంశం.