హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణకు 'నో' చెప్పిన అధికారులు!

10-01-2020 Fri 09:27
  • ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన రాజశేఖర్
  • గడువు ముగిసినా రెన్యువల్ చేయించుకోని హీరో
  • రద్దు కొనసాగుతుందని ట్రాన్స్ పోర్ట్ అధికారి స్పష్టీకరణ

హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ ను పునరుద్ధరించబోమని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇటీవల ఆయన తన కారును స్వయంగా నడుపుతూ, ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడగా, గడువు ముగిసిన లైసెన్స్ ను రెన్యువల్ చేసుకోకుండా ఆయన వాహనాన్ని నడిపారని ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ రమేశ్ వెల్లడించారు. అతివేగంతో ఆయన ప్రయాణించారని తేలిందని స్పష్టం చేశారు. దీంతో ఆయన లైసెన్స్ ను రద్దు చేశామని అన్నారు.

కాగా, గడచిన రెండేళ్ల వ్యవధిలో 12 ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన పాయింట్లను తెచ్చుకున్న వాహన దారుల డ్రైవింగ్ లైసెన్స్ లను 3 నుంచి 6 నెలల పాటు సస్పెండ్ చేశామని, డ్రంకెన్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వారి లైసెన్స్ లు కూడా సస్పెన్షన్ లో ఉంచామని ఆయన అన్నారు.