విజయవాడ బెంజ్ సర్కిల్ లో అమరావతి జేఏసీ ఆఫీసుకు తాళమేసిన పోలీసులు!

10-01-2020 Fri 08:23
  • వేదిక కల్యాణ మండపంలో కార్యాలయం
  • తాళాలు వేసిన పోలీసులు
  • ఆందోళన చేపట్టిన నాయకులు

అమరావతిని పరిరక్షించాలన్న ఉద్దేశంతో, రైతులు, రాజకీయ నాయకులు ఏర్పాటు చేసుకున్న జేఏసీ కార్యాలయానికి పోలీసులు తాళం వేశారు. విజయవాడ, బెంజ్ సర్కిల్ లోని వేదిక కల్యాణ మండపం, ఇంతవరకూ విపక్షాల నిరసనలకు వేదిక కాగా, ఈ ఫంక్షన్ హాల్ నే జేఏసీ కేంద్ర కార్యాలయంగా వినియోగిస్తోంది. ఈ నేపథ్యంలో పటమట పోలీసులు వచ్చి ఫంక్షన్ హాల్ కు తాళం వేసి, యజమాని చెన్నుపాటి వజీర్ కు నోటీసులు ఇవ్వడం గమనార్హం. అర్ధరాత్రి పోలీసులు వచ్చి తాళాలు వేయగా, ఈ ఉదయం జేఏసీ నాయకులు వచ్చి తీవ్ర ఆందోళన చేపట్టారు.