నేటితో ఈశాన్య రుతుపవనాలకు సెలవు!
- గతేడాది అక్టోబరులో ఏపీలో ప్రవేశించిన ఈశాన్య రుతుపవనాలు
- రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదు
- భారీ వర్షాలు లేకపోవడంతో పంటలకు తప్పిన ముప్పు
తుపాన్లు ఏపీ తీరాన్ని తాకకపోవడంతో నవంబరు, డిసెంబరు నెలల్లో భారీ వర్షాలు కురవలేదు. ఫలితంగా పంటలకు నష్టం వాటిల్లలేదు. ఇక, ఈశాన్య రుతుపవనాల సీజన్ అయిన అక్టోబరు నుంచి డిసెంబరు వరకు ఏపీలో మొత్తంగా చూసుకుంటే సాధారణ వర్షపాతం నమోదు కాగా, ప్రకాశం, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది.