తెలుగు భాష అమ్మఒడి లాంటిది: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ప్రారంభం
- భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలి
- మన కట్టూబొట్టు మరచిపోకూడదు
ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలని, మన కట్టూబొట్టు మరచిపోకూడదని సూచించారు. తెలుగు భాష అమ్మఒడి లాంటిదని, దీనిని అందరూ కాపాడుకోవాలని అన్నారు.
దేశ రాజకీయాల్లో వెంకయ్యనాయుడు ఒక బ్రాండ్: గవర్నర్ తమిళి సై
తెలంగాణ గవర్నర్ తమిళి సై మాట్లాడుతూ, తెలుగు సంప్రదాయం అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడుపై ప్రశంసలు కురిపించారు. దేశ రాజకీయాల్లో వెంకయ్యనాయుడు ఒక బ్రాండ్ అని, ఆయన సేవలు సమాజ హితానికి ఎంతో మేలు చేస్తాయని అన్నారు.