టీడీపీ హయాంలో రైతుల కోసం చేసిన ఒక్క మంచి పని చెబుతారా?: మంత్రి బొత్స

09-01-2020 Thu 19:03
  • అప్పుడు వైఎస్, ఇప్పుడు జగన్ హయాంలో రైతులకు ఎన్నో పథకాలు
  • రైతులకు మా ప్రభుత్వం ఎందుకు నష్టం చేస్తుంది?
  • ఇలాంటి రాతలు రాసే పత్రికలను ఎవరూ చదవరు

టీడీపీ హయాంలో రైతుల కోసం చంద్రబాబు చేసిన ఒక్క మంచి పని గురించి చెప్పాలని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. తాడేపల్లిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో, ఇప్పుడు జగన్ హయాంలో కనుక చూస్తే రైతుల కోసం ఎన్నో పథకాలు పెట్టారని అన్నారు. రైతులకు తమ ప్రభుత్వం ఎందుకు నష్టం చేస్తుందని ప్రశ్నించారు.

 ఇలాంటి రాతలు రాసే పత్రికలను ఎవరూ చదవని రోజులు వస్తాయని, దేవుడు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలే తప్ప, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇష్టానుసారం వ్యవహరించవద్దని సూచించారు. నిన్న విజయవాడలో జరిగిన ఘటనపై ప్రస్తావిస్తూ, బస్సుయాత్ర పేరిట అల్లకల్లోలం సృష్టించాలని చూశారంటూ టీడీపీ నేతలపై మండిపడ్డారు.