సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

09-01-2020 Thu 07:24
  • షాక్ ఇస్తున్న పూజ హెగ్డే పారితోషికం 
  • భారీ స్థాయిలో 'దర్బార్' బిజినెస్ 
  • రూటు మార్చిన మంచు లక్ష్మి

 *  తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్న కథానాయిక పూజ హెగ్డే ఇప్పుడు కళ్లు చెదిరే పారితోషికాన్ని డిమాండ్ చేస్తోంది. ఇప్పటి వరకు కోటిన్నర వరకు తీసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా అడివి శేష్ నటిస్తున్న 'మేజర్' చిత్రం కోసం రెండున్నర కోట్లు అడిగిందట. దాంతో ఆ చిత్ర నిర్మాతలు మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నట్టు సమాచారం.
*  రజనీకాంత్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన 'దర్బార్' చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా, రెండు తెలుగు రాష్ట్రాలలోను కలిపి ఈ చిత్రం 14 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట.
*  పలు సినిమాలలో నటించిన మంచు లక్ష్మి తాజాగా ఓ వెబ్ సీరీస్ లో నటిస్తోంది. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించే ఈ వెబ్ సీరీస్ రాజకీయ నేపథ్యంలో సాగుతుందట. త్వరలో షూటింగ్ మొదలవుతుంది.